పిఠాపురం : మూగ జీవులకు మండు వేసవిలో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిద్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రంలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య స్వామి కృష్ణానంద, బావర్లాల్ జైన్, రమేష్ జైన్, అంబాలాల్ జైన్, రిటైర్డ్ ఆర్టీవో రామచంద్ర రావు, తురగా సూర్యారావు, స్టేట్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ ఎండి జహురుద్దీన్ జిలానీ, ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అమృత హస్తములతో మజ్జిగ స్వీకరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ స్వీకరించుట ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, ఆరోగ్యం కాపాడు కొనవచ్చును అని అన్నారు. స్వామి కృష్ణానంద మాట్లాడుతూ డాక్టర్ ఉమర్ ఆలీషా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమైనది అని స్లాగీస్తూ, మానవ కల్యాణం కొరకే కాకుండా, జీవరాశి మనుగడ కోసం ప్రయత్నిస్తున్న మీ కార్యకర్తలకు కూడా భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయని అన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది సభ్యులు మంచినీటి, మజ్జిగ, పక్షుల, పశువుల చలివేంద్రంలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో
బావర్లాల్ జైన్, విజయ్ జైన్, ఎం.ఎస్.ఎన్ చారిటీస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కాశిన వెంకటేశ్వరరావు విశిష్ఠ దాతలుగా వ్యవహరించారు. పక్షుల చలివేంద్రం నిర్వాహకులు పేరూరి సన్యాసిరావు, అన్నపూర్ణ దంపతులు, మజ్జిగ చలివేంద్రం నిర్వాహకులు కొజ్జవరపు వీరభద్రరావు, అమ్మాజి దంపతులు, పశువుల చలివేంద్రం నిర్వాహకులు మరిసే నాగేశ్వరరావు మరియు కాకినాడ ఆశ్రమ శాఖ కన్వీనర్ కాకినాడ లక్ష్మి పాల్గొన్నారు. యువ మండా మోహన్ కృష్ణ , మండా ఉమా మాహేశ్వరి, మహేంద్ర వర్మ, భార్గవ్, సునీత తదితరులు పాల్గొన్నారు.

previous post