Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాల పోస్టర్ విడుదల

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 31 న హైదరాబాద్ లోని జల విహార్ లో నిర్వహిస్తున్న 25 వసంతాల రజతోత్సవ పోస్టర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు పెడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నాయకత్వంలో రజతోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి ఎల్. రాజు, యూనియన్ నాయకులు ఏం .సంతోష్, ఆర్ సుభాష్, నేరడిగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాజుల దేవేందర్, నాయకులు కొప్పుల ప్రమోద్, గాజుల శ్రీకాంత్, సతీష్, నవీన్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

TNR NEWS

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

మహిళలపై దాడులను ఆపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి

TNR NEWS