ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో రూపాయలు 18 లక్షలు, దంతనపల్లి గ్రామంలో రూపాయలు 25 లక్షల వ్యయంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు చెరువుల ఎంతో గానో ఉపయోగపడతాయని అన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన పూదరి లక్ష్మీ కుటుంబ సభ్యులకు రూ .19వేల సీఎం సహాయనిధి చెక్కును ఉట్నూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ తెలిపారు.