బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ క్యాంపు కార్యాలయం (సిరిసిల్ల) పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడంతో… అడ్డుకోబోతున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు గుండాల్ల వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులకు ఒక క్యాంప్ కార్యాలయంపైన దాడి చేయాల్సినంత అవసరం ఏముంది? పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని గతంలో కూడా మాజీ మంత్రివర్యులు హరీశ్ రావు గారి క్యాంప్ కార్యాలయంపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయి దాడిచేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఉండగా.. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు కుడా చేర్చడంతో దీని నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మార్చడానికి మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ కి జరిగిన అవమానాన్ని బయటపెట్టడంతో దాని నుండి కూడా ప్రజల దృష్టిని మార్చడానికి ఇలాంటి కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా దాడులకు ప్రేరేపిస్తున్నారు.
బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాప్ కార్యాలయాల పైన దాడులు జరగలేదు.
అహంకారంతో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయినట్టు.. అధికారం రాగానే రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ నాయకులు చేసే ప్రతి తప్పును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు.
ఇప్పటికైనా మీ వక్రబుద్ధి మానుకొని ప్రజలకు సేవ చేయడం పైన దృష్టి పెడితే బాగుంటుందని ప్రధాన ప్రతిపక్షంగా, వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తెలియజేస్తున్నాను.