Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసులు, మోటారు ట్రాన్స్పోర్ట్ రోడ్డు నిభందనలు ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపినారు.రాజీయే రాజ మార్గమన్నారు.చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృదా చేసుకోవద్దన్నారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు సంభందిత పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందన్నారు.

Related posts

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs

అంగరంగ వైభవంగా శ్రీ గోదారంగనాదుల కళ్యాణ మహోత్సవం..

TNR NEWS

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 

TNR NEWS

ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం

TNR NEWS