భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..రైతులు తమ సమస్యలను దరఖాస్తుల్లో స్పష్టంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తుల్లో రైతులు వ్యక్తం చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో 117 మంది రైతులు దరఖాస్తులు అందేశారన్నారు.

previous post
next post