దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ కోరారు. సోమవారం హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ చైర్మన్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సమావేశాలు నిర్వహించి బాధితులకు అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…….

previous post