ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని,ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.ప్రపంచ శాంతి కొరకు మనమందరం కలిసి ఉండాలని మంత్రి ఆకాక్షించారు.జిల్లా ప్రజలకు దేవుడి దయ వల్ల దీర్ఘాయువు కలగాలని, మరింత కాలం సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాక్షించారు.