తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గ్రూప్-4 ఫలితాలు విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపారు. 8,084 మందితో కూడిన ప్రొవిజినల్ జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ 1, 2022న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 8,180 పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
