Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్య వాదుల దాడులను తీవ్రంగా వ్యతిరేకించండి  వామపక్ష నేతల డిమాండ్

సూర్యాపేట:గత రెండు మూడు రోజులుగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ కు అండదండగా సాగిస్తున్న భయంకరమైన యుద్ధ దాడులను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఎం సిపిఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య అన్నారు. మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇరాన్ పై అమెరికా దాడులను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅమెరికా ఇజ్రాయిల్ యొక్క అనైతిక రెచ్చగొట్టే విధానం ద్వారా మొత్తం ఆసియా ఖండాన్ని యుద్ధ మంటల్లోకి నెట్టడమే కాకుండా ఈ యుద్దోన్మాద చర్య ప్రపంచ శాంతికి కూడా విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఇజ్రాయులకు అండగా అమెరికా ఇరాన్ పై యుద్ధం కు దిగిందని మొత్తం ప్రపంచానికి తెలుసు.

ఇజ్రాయిల్ ప్రపంచ శాంతి కాముకులను ప్రజలను ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి తో సహా అన్ని అంతర్జాతీయ సంస్థలను అగౌరవపరచడం ద్వారా పాలిస్తీనీయన్ల ను ఊచకోత కోసి విధ్వంసం సృష్టించడమే కాకుండా మధ్య ప్రాచ్యం లోని అన్ని దేశాలను యుద్ధం లోకి నెట్టింది. దీనికి విరుద్ధంగా అమెరికా నిఘా విభాగం అధికారి తులసి గబ్బర్డ్ ఇరాన్ అనుబాంబు తయారు చేయలేదని ఈ సంవత్సరంలో మూడుసార్లు ప్రకటించారు. ఆ సామర్థ్యం ఇరానుకు లేదని అన్నారు IAEA( అంతర్జాతీయ అణుశక్తి) ఇరాన్ ఎటువంటి అనుబాంబులను తయారు చేయడం లేదని దాని అన్ని అణు విద్యుత్ ఉత్పత్తి సౌకర్యాల తనిఖీ లో అన్ని విధాలుగా సహకరిస్తుందని ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రేసి మూడు రోజుల క్రితం అన్నారు. ఇరాన్ అను ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం ( NPT) పై కూడా సంతకం చేసిందని అన్నారు. ఐక్యరాజ్యసమితిలోనూ అనుబాంబులను తయారు చేయనని ఇరాన్ హామీ ఇచ్చింది కానీ అన్ని న్యాయ సూత్రాలను , ఐక్యరాజ్యసమితిని, భద్రతా మండలిని ధిక్కరించి అమెరికా చేస్తున్న యుద్ధ దాడులను భారత ప్రభుత్వం దృఢంగా నిలబడి వ్యతిరేకించాలి.

ప్రపంచశాంతికాముకులందరినీ ఏకం చేసి అమెరికా యుధోన్మాదాన్ని నివారించాలని వామపక్ష పార్టీలు కోరుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, కోట గోపి, సిపిఐ నాయకులు సృజన, ఎల్లవుల రాములు, బూర వెంకటేశ్వర్లు, అనంతుల మల్లేశ్వరి, ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు, సృజన, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య, పోలేబోపోయిన కిరణ్, కొనుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు గొడ్డలి నరసన్న పాల్గొన్నారు.

Related posts

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

TNR NEWS

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

జర్నలిస్టులకు అండగా టీజేయు – కప్పర ప్రసాద్ రావు – ఘనంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం 

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

Harish Hs