Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గురువారం  కోదాడలోని ప్రభుత్వ 30 పడకల దవాఖానాలను పరిశీలించారు. ఓపి రిజిస్టర్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు, గైనకాలజిస్ట్ పద్మావతి లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆసుపత్రిని పరిశీలనకు వచ్చిన ప్రతిసారి గైనకాలజిస్ట్ విధులలో కనిపించడం లేదని ఆసుపత్రి సూపర్డెంట్ Dr దశరథ ను నివేదిక సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఔషధాల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు, అన్ని రకాల పేషెంట్లకు మందులు అందుతున్నాయా అడిగి తెలుసుకున్నారు, అనంతరం ప్రసూతి గదిలో సాధారణ ప్రసవాలు ఎన్ని జరిగాయి డ్యూటీ డాక్టర్ను వైష్ణవిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ సాధారణ ప్రసవం అయిన రెడ్ల కుంట గ్రామానికి చెందిన ముత్యాల శిరీష తో కలెక్టర్ మాట్లాడారు, డాక్టర్లు వైద్యం సరిగా నిర్వహిస్తున్నారా, సకాలంలో మందులు అందజేశారా, పుట్టిన బాబుకు వ్యాక్సినేషన్ చేశారా లేదా అని శిరీషను కలెక్టర్ అడిగారు. అక్కడనుండి కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ రూమును పరిశీలించారు, కొత్త బ్లాక్ కొరకు జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. లేఅవుట్ ను పరిశీలించి వారానికి ఒకసారి జరుగుతున్న పనుల యొక్క నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 

 

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ ఆలి, డిసిహెచ్ఎస్ యస్. వెంకటేశ్వర్లు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

 

Related posts

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

TNR NEWS

మండవ శాంతి కుమార్ మృతి-సిపిఎం పార్టీ కి తీరని లోటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.

TNR NEWS

సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించుకొని ఇష్టంగా చదువుకోవాలి గజ్వేల్ షీ టీమ్ ఏఎస్ఐ శ్రీరాములు

TNR NEWS

ఆకుపాముల గ్రామం లో బడిబాట కార్యక్రమం

TNR NEWS

ఘనంగా నయా నగర్ వాసుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS