శ్రావణమాస సందర్భంగా జోగిపేట ముత్యాలమ్మ దేవాలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు దంపతులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కీర్తి శేషులు కటుకం వేణుగోపాల్ తనయులు కటుకం ప్రవీణ్, నవీన్ ఆధ్వర్యములో అమ్మ వారికీ అభిషేకం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.