మునగాల లోని ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నత పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్కు మునగాలకు చెందిన సోషల్ వర్కర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం సైదులు కలెక్టర్ తేజేస్తున్నందులాల్ పవర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్ పోస్ట్ తో పాటు స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుంచి ఫర్నిచర్ లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందుల గురవుతున్నారని ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసి నూతన హాస్పిటల్ లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను విన్న కలెక్టర్ ఆసుపత్రిలో తక్షణమే పెన్ పహాడ్ మండలంలో పనిచేస్తున్న డాక్టర్ను మునగాల ఆసుపత్రికి కేటాయించినట్లు ప్రకటించారు. స్టాఫ్ నర్స్ పోస్ట్ ను రెండు మూడు రోజుల్లో భర్తీ చేస్తామని ఆస్పత్రిలో ఏమేమి ఫర్నిచర్ అవసరం ఉందో తనకు లిస్టు రాసి పంపియాలని వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ హైవే పై ఉన్న మునగాల ఆసుపత్రి లో 24 ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మునగాల మసీదు ఎదురుగా అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయించాలని త్వరగా నేషనల్ హైవే అథారిటీ వారితో మాట్లాడి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్కు సోషల్ వర్కర్ సైదులు కృతజ్ఞతలు తెలిపారు.

previous post