Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

 

మండలం లోని గుడికందుల ఉన్నత పాఠశాలకు 4 సీసీ కెమెరాలు, మానిటర్ ను బుధవారం రోజున దాత ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంబిగల్ల సాయి ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిరుదొడ్డి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరశురాం, తొగుట మండల విద్యాధికారి వడ్లకొండ నరసయ్య, దాత సాయి ప్రసాదును ఘనంగా సన్మానించారు. ఎస్సై పరశు రామ్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ఎలాంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమా లకు పాల్పడ్డా వాటిని నిరోధించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలో పూల, క్రోటన్ మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరపాటకం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు సోమ గారి నాగిరెడ్డి, వేణుమాధవ్, హనుమారెడ్డి, కనక రాములు ,రవీందర్ రెడ్డి, శివయ్య ,భాస్కర్ రెడ్డి, పర్వేజ్, బండారి లావణ్య, అనసూయ సిఆర్పి వెంకటస్వామి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రజలందరి దేవుడు అంబేద్కర్

TNR NEWS

TG : తలసరి ఆదాయంలో తెలంగాణ కింగ్.. రంగారెడ్డి జిల్లా టాప్..!!

TNR NEWS

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడులు…  ముగ్గురు అరెస్ట్…

TNR NEWS

విద్యార్థులకు పరిశీలన విజ్ఞానాన్ని పెంపొందించాలి

TNR NEWS

రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

TNR NEWS

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని విజయోత్సవ సభలు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి 

TNR NEWS