విద్యార్థులు న్యాయ సేవల పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి, మెడికల్ బాలికల కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ముఖ్యంగా కళాశాలలో యువత ఏమాత్రం తప్పటడుగు వేసిన భవిష్యత్తులో జీవితం అంధకారంగా మారే అవకాశం లేకపోలేదు అన్నారు. చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగం, ఫోక్సొ చట్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకట రెడ్డి , బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య,సీనియర్ న్యాయవాది గట్ల నర్సింహారావు, టి.సీతారామరాజు, చలం ,దొడ్డ శ్రీధర్, జానీపాషా, కె.శరత్ కుమార్,ఆవుల మల్లిఖార్జున్, ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్, మండవ మధు, శివశంకర్ దుర్గాప్రసాద్,పారా లీగల్ వాలంటీర్లు, మండల లీగల్ సర్వీస్ సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

previous post