November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులుకు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్ వరించింది. కాగా శనివారం హైదరాబాదులో జరిగిన త్యాగరాయ గాన సభ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి, విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గతంలో సూక్ష్మ కళారూపాలు 501 బియ్యపు గింజలపై ఎనిమిది భాషల జాతీయ గీతం రాయడం జరిగిందని 13 మిల్లిలా చెస్ బోర్డు విత్ కాయిన్స్ వంటి ఎన్నో కళారూపాలు తాను తయారు చేసినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తమలపాకుల సైదులకు అవార్డు రావడం పట్ల పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు………

 

Related posts

ఇండియన్ బ్యాంక్ వారి తో సమావేశం నిర్వహించిన.. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

TNR NEWS

కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో

TNR NEWS

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Harish Hs

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS