తెలంగాణ సాయుధ రైతంగా పోరాట యోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూమి బుక్తి విముక్తికై సాగిన పోరాటంలో అలుపెరగని పోరాటయోధుడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు శుక్రవారం స్థానిక ఎం వి ఎన్ భవనంలో జరిగిన కృష్ణమూర్తి 19 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ములకలపల్లి రాములు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోను నంతరం జరిగిన అనేక భూ పోరాటాల్లో పాల్గొని పేదలకు భూ పంపిణీ చేసేంతవరకు సమరశీల ఉద్యమాలు నిర్మించారని ఆయన అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా కూలి భూమి ఉపాధికై పోరాడి అనేక విజయాలు సాధించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు అలాంటి పోరాట యోధుడి ఆశయ సాధన కోసం మనందరం ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు నేడు పాలకవర్గాలు ప్రజా సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా. వైపల్యం చెందాయని ఆయన విమర్శించారు పాలకవర్గాలు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలుకు నోచుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రానున్న కాలంలో కృష్ణ మూర్తి స్ఫూర్తితో భూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు కొలిశెట్టి యాదగిరి రావు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న జిఎంపిఎస్ గౌరాధ్యక్షులు వీరబోయిన రవి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిన్నపంగా నరసయ్య ములకలపల్లి శ్రీను వెంకన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు

previous post