సూర్యాపేట: ప్రపంచ మానవాళి విముక్తికై కృషిచేసి ప్రపంచంలోనే తొలి సోషలిస్ట్ రాజ్యాన్ని సాధించిన మహా నాయకుడు విముక్తి ప్రదాత లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో ఐవి లెనిన్ 101వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవత్సరాల నుండి కొనసాగిన దోపిడీని తుడముట్టించి సమ సమాజాన్ని నిర్మించాడని ఆయన సేవలను కొనియాడారు. మార్క్స్ శాస్త్రీయ సిద్ధాంతాన్ని ఆయన అమల్లోకి తీసుకు వచ్చారని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి సంపద ప్రజలందరికీ సమానంగా అందించాలని ఆకాంక్షించారని అన్నారు. లెనిన్ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా బలపరచారని అన్నారు. ప్రపంచ శ్రామిక ప్రజలందరికీ సకల సౌకర్యాలు అందించాలని, అది సోషలిస్టు వ్యవస్థలో సాధ్యమని లెనిన్ భావించారని అన్నారు. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు జిల్లా పల్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, మేకన పోయిన శేఖర్, వీరబోయిన రవి, నాయకులు అవిర అప్పయ్య, వెలుగు మధు చేగువేరా, కంచు గట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.