మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి పీఏ సి ఎస్ లో అటెండర్ గా గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మిట్టగనుపుల లచ్చయ్య గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కొక్కిరేణి కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు చందా చంద్రయ్య లచ్చయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.