కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మాల సింహ గర్జన సభను విజయవంతం చేసిన జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజం సాగర్, పెద్ద కొడప్గల్, డోంగ్లి, మహమ్మద్ నగర్ ఈ ఎనిమిది మండలాల మాల కు ప్రతి ఒక్కరికి సోమవారం మాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
మాల మాదిగలను విడదీసి రిజర్వేషన్ను రద్దు చేసేందుకు చేస్తున్న కుట్రను ఖండిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341 కి వ్యతిరేకమని ఎస్సి వర్గీకరణ భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. వ్యతిరేక పోరాట సమితి నాయకులు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన మాల సింహగర్జన సభను విజయవంతం చేసిన మాలల కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల నాయకులు గజానంద్ మిలింద్ రాజు తదితరులు ఉన్నారు.