Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు. ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు పాడి పంటలకు ఆయుర్ ఆరోగ్యాలకు గ్రామదేవతల ఆశీస్సులు ఉండాలన్నారు ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి ప్రభ ముస్తాబుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడ్ల బండి భారీ ప్రదర్శనతో పట్టణంలో గత సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి ప్రజలంతా ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. కాగా తొలుత ఎర్నేని ఇంటి వద్ద ప్రభ బండి ను టీపీసీసి డెలిగేట్ సీహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రావేల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

Related posts

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

పేదలకు అన్నదానం పుణ్యకార్యం

Harish Hs

ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్

TNR NEWS

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

Harish Hs

జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

Harish Hs