Tnrnews.in
తెలంగాణ

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

యువత కి చాలా భవిష్యత్ ఉందని మత్తు ముందుకు బానిస అవ్వొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు నార్కోటిక్ కో ఆర్డినేషన్ సెంటర్ (యన్ సి ఓ ఆర్ డి -ఎన్ కార్డు )పై జిల్లా ఎస్పి నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యాసంస్థలు ఎక్కువ ఉన్న సూర్యాపేట,కోదాడ లో యువత కి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమానం ఉన్న ప్రదేశాలలో సి సి కెమెరా లు, లైట్స్, పెట్రోలింగ్ జరపాలని తెలిపారు. డ్రగ్స్ నుండి బయట పడేందుకు డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు కి ప్రతిపాదనలు పంపటం జరిగిందని తెలిపారు. ఇండస్ట్రీయల్ ఉన్న ప్రదేశాలలో వేరే రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల ఉన్న చోట కమ్యూనిటీ మీటింగ్ ల్

నిర్వహించాలని అధికారులకి సూచించారు.విద్యా శాఖ, పోలీస్ శాఖ వారు యువత డ్రగ్స్ నుండి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయాలని అలాగే జిల్లా యువత చేడు వ్యసనాలకి, డ్రగ్స్ కి బానిస అవ్వకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.

 

జిల్లా ఎస్పి నరసింహ మాట్లాడుతూ 2024 లో 139 మందిని, 2025 లో 23 మందిని గంజాయి తరలిస్తుండగా అరెస్ట్ చేయటం జరిగిందని గంజాయి మహమ్మారీ నేడు గ్రామాలకి విస్తరించి యువత చేడుపోతున్నారని, చివరికి చిన్న పిల్లలకి చాక్లేట్ రూపంలో మత్తు పదార్థలు అలవాటు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రహరీ క్లబ్స్, ఆంటీ డ్రగ్స్ కమిటీ లు డ్రగ్స్ నుండి జిల్లాకి విముక్తి కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు.ప్రతి బుధవారం అధికారులు డ్రగ్ ని నిర్ములన కి సంబందించిన పోస్ట్ లను వాట్సాప్ స్టేటస్, డిపి లుగా పెట్టుకోవాలని తెలిపారు.

 

తదుపరి తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో వారిచే రూపొందిన పోస్టర్ ని కలెక్టర్ విడుదల చేశారు.

 

ఈ సమావేశం లో ఆంటీ నార్కోటిక్ డ్రగ్స్ డి ఎస్ పి బిక్షపతి రావు, డి టి ఓ సురేష్ కుమార్,డి ఈ ఓ అశోక్, డి ఐ ఈ ఓ భాను నాయక్,డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ సురేందర్,సూపరిటీడెంట్ శ్రీనివాస రాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

Harish Hs

ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం

TNR NEWS

కోదాడ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్

Harish Hs

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

Harish Hs

సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం కోలాటాలు నృత్యంతో నిరసన సీఎం హామీ నిలబెట్టుకోవాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ

TNR NEWS