సజ్జ సూర్యనారాయణ నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. గురువారం కోదాడ పట్టణం హుజూర్నగర్ రోడ్డులో మంచితనానికి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే సజ్జ సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు సజ్జ త్రివేది, హేమావతి గత నాలుగు సంవత్సరాలుగా వారి తండ్రి పేరు పదికాలాలపాటు ప్రజల్లో గుర్తుండి పోయేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం పేదలకు అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సజ్జ త్రివేది,హైమావతి, నతేష్ కుమార్, సరోజినీ, మోహన్ రావు, నాగమణి, ధన మూర్తి తదితరులు పాల్గొన్నారు……….

previous post
next post