కోదాడ పట్టణ పరిధిలోని షిరిడి నగర్ కాలనీవాసులకు వాగు నుండి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం షిరిడి సాయి నగర్ కు వచ్చే వాగులో గుర్రపు డెక్కను ఆయన పరిశీలించి మాట్లాడారు. తమ్మర వాగు లో ఉన్న గుర్రపు డెక్క ఈ వాగులో వేయడం మూలంగానే గతంలో కూడా షిరిడి సాయి నగర్ వరద ముంపుకు గురైందని గుర్రపు డెక్కను తొలగించాలనీ ఆయన మున్సిపల్ కమిషనర్ రమాదేవితో చర్వాణిలో సమస్యను వివరించారు. మున్సిపల్ అధికారి రాజయ్య కు గుర్రపు డెక్కను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గుర్రపు డెక్క కారణంగా కాలనీ వాసులకు దుర్వాసనతో అనారోగ్యం కలుగుతుందని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు. ఎమ్మెల్యే పద్మావతి సహా కారం తో కాలనీవాసులకు ఇబ్బందులు కలక్కుండా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణా రావు, లైటింగ్ ప్రసాద్, భాస్కర్ ఉన్నారు.

previous post