Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ దీపస్తంభం

కె .ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల,కోదాడ ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…

కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… స్వరాష్ట్ర సాధన కోసం సమరం సాగిస్తూ, ఆంధ్ర వలస పాలనను అంతం చేసే దిశగా తెలంగాణ వాదాన్ని ప్రతి ఒక్కరిలో కలిగిస్తూ, మారుతున్న తరానికి మార్గం చూపుతూ, మలిదశ పోరాటానికి పునాదయ్యారని అన్నారు. తెలంగాణ కోసం జరిగిన మూడు దశల పోరాటాలలో జయశంకర్ సార్ది కీలక భూమిక అన్నారు. సిద్ధాంతకర్తగా, విషయ విశ్లేషకునిగా, ఆచార్యునిగా అనేక మందిని ఆలోచింపచేస్తూ… తెలంగాణ సాధన కోసమే తన జీవితాన్ని అర్పించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకతను వివరిస్తూ అనేక రచనలు చేసి, తెలంగాణ మేధావులను చైతన్యపరిచారని ఆయన అన్నారు. జయశంకర్ సార్ మార్గంలో అందరూ పయనించి సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్. పిచ్చి రెడ్డి, జి.యాదగిరి, వి.బలభీమారావు,ఆర్.రమేష్ , పి.రాజేష్, ఎం. రత్నకుమారి, బి.రమేష్ బాబు, జి. వెంకన్న, కె.రామరాజు, జి.రవి కిరణ్, కె.సతీష్, జి. నాగరాజు, ఎస్. గోపికృష్ణ, ఎస్.కె ముస్తఫా, ఇ.నరసింహారెడ్డి, ఎస్. కే .ఆరిఫ్,ఎన్ జ్యోతిలక్ష్మి ,ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటేశ్వర చారి, టీ.మమత, డి.ఎస్. రావు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు…

Related posts

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి కొండంత ధీమా

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఎం ఎల్ ఏ పద్మావతి జన్మదిన వేడుకలు

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

Harish Hs

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS