ప్రతిభ కలిగి పేదరికంలో ఉన్న నిరుపేద విద్యార్థులకు కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సహకారం అందించి అండగా ఉంటున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. ఆదివారం బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం వద్ద నిరుపేద కుటుంబాలకు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు, కుల మతాలకు అతీతంగా ప్రతిభ కలిగి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 16 మంది విద్యార్థులకు మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ ధర్మపత్ని వీరేపల్లి సత్యవతి స్మారకార్థం 3 లక్షల 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మాట్లాడారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కులాలకు,మతాలకు అతీతంగా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా ఎంతోమందికి తమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా సహకారం అందించామని గుర్తు చేశారు. సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వేమూరి సురేష్, రావెళ్ల సీతారామయ్య, వీరేపల్లి సుబ్బారావు, డాక్టర్ జాస్తి సుబ్బారావు, ముత్తవరపు పాండురంగారావు, రామారావు, గంట సత్యనారాయణ, కొత్త బ్రహ్మయ్య, వీరేపల్లి నాగేశ్వరరావు, కొత్త రాంబాబు, తమ్మినేని భ్రమరాంబ, కాకర్ల వెంకటేశ్వరరావు, బొల్లు రాంబాబు తదితరులు పాల్గొన్నారు………

next post