Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మహిళల భద్రత కోసమే షీ టీమ్స్

కోదాడ లోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట జిల్లా ” షీ టీమ్” ఆధ్వర్యంలో కోదాడ విభాగం వారు విద్యార్థులకు చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల తెలుగు అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా… “కోదాడ షీ టీం హెడ్ కానిస్టేబుల్ యం. కవిత ” పాల్గొని ఆమె మాట్లాడుతూ సమాజంలోని అమ్మాయిలు, మహిళలు సురక్షితంగా ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. అమ్మాయిలను, విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించడంజరుగుతుందని, ఈవ్ టీజింగ్ లకు పాల్పడే ఆకుతాయిల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇస్తామని, అయినప్పటికీ నేరం చేసి పట్టుబడితే నిర్భయ కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. షీ టీం బృందం నిఘా సూక్ష్మ కెమెరాలతో, సాధారణ దుస్తులతో జనంలో కలిసిపోయి ఆకతాయిలను, వేధింపులకు గురి చేసే వారిని గుర్తిస్తున్నామని అందుకే ఇలాంటి కార్యకలాపాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ టీం ప్రతి ఒక్కరికి ఈ నేరాలపై అవగాహన ఉండేలా సదస్సులు, కౌన్సిలింగులు చేస్తున్నామని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ ఆర్ .పిచ్చిరెడ్డి, షీ టీం బృందం కానిస్టేబుల్ కె.సాయి జ్యోతి, కానిస్టేబుల్ జి. నాగేంద్రబాబులతో పాటుగా అధ్యాపకులు జి. యాదగిరి, వి. బల భీమారావు, ఆర్. రమేష్, పి .రాజేష్, ఎం. రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి .వెంకన్న, కె. రామరాజు, జి. రవి కిరణ్, జి .నాగరాజు, ఎస్. గోపికృష్ణ, ఎస్కే. ముస్తఫా, ఈ. నరసింహారెడ్డి, ఎస్. కే. ఆరిఫ్, ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్ .చంద్రశేఖర్, ఎస్. వెంకటేశ్వర చారి, టీ.మమత, డి.ఎస్. రావు విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు..!!_ ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు.. తీరనున్న 48 వేల మంది కష్టాలు

TNR NEWS

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

TNR NEWS

రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష

TNR NEWS

మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ

Harish Hs