తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర సదస్సు కరపత్ర ఆవిష్కరణ ఆదివారం జిల్లాలోని టౌన్ హాల్లో ఆవిష్కరించరు.
ఈనెల 21న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్ అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మ గౌరవ రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కళాకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అర్హులైన కళాకారులకు 25 వేల పెన్షన్ కల్పించాలని సాంస్కృతిక సారధిలో 1000 ఉద్యోగాలు పెంచాలని మరియు ఇందిరమ్మ ఇండ్లలో 10% వాటా ఉద్యమ కళాకారులకు ఇవ్వాలని మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేయాలని ఐదు డిమాండ్లతో ఈ యొక్క రాష్ట్ర సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమములో జగిత్యాల జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు జవ్వాజి శంకర్. ఉద్యమకళాకారులు జిల్లా అధ్యక్షులు గంగాధర్ నాయక్, ప్రధాన కార్యదర్శి మల్యాల సతీష్ కుమార్, కోశాధికారి కండ్లే అంజన్న, ఉపాధ్యక్షులు సంగేపు బాపు, సాంస్కృతిక కార్యదర్శి ఈదునూరి రమేష్, సైదల గంగజల, బొల్లి రాజు యాదవ్, సబ్బు జగన్, ఓరుగంటి రాకేష్, అరికెళ్ల చందు, అదినేని రజనీకాంత్, తదితర కళాకారులు పాల్గొన్నారు.