రోడ్డు పక్కన చిన్న చిన్న డబ్బా కోట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ వద్ద చిరు వ్యాపారులతో పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ షేక్ షమీతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు.బడా బాబులు ఆక్రమించుకుంటే పట్టించుకోని వారు జీవనోపాధి కొరకు చిన్న చిన్న డబ్బి కోట్లు వేసుకున్న వారిని వేధించడం సరైనది కాదన్నారు.సమస్యను మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకువెళ్లి చిరు వ్యాపారులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు.ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ షేక్ షమీ, మజాహర్,జానీ మియా, వెన్నెల శ్రీను, రామకృష్ణ,ఖలీల్, షేక్ జానీ, గంధం రామకృష్ణ, మహమూద్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు…….