Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గాలు ఏర్పాటు చేసిన న్యాయవాది గౌరీమణి

విశాఖపట్నం : ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉత్తరాంధ్ర జిల్లాలలో కార్యవర్గాలు ఏర్పాటు చేసినట్లు ఆ సొసైటీ ప్రెసిడెంట్ బొలిశెట్టి గౌరీమణి తెలిపారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్ 2 నందు ఏర్పాటు చేసిన ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశంలో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాల, జిల్లా కార్యవర్గ సభ్యులను నియమించినట్లు ఆమె తెలిపారు. పార్వతీపురం జిల్లా ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ పార్వతీపురం బార్ సభ్యుడు జి.శశిభూషణ రావు, వైస్ ప్రెసిడెంట్ -1 సాలూరు బార్ సభ్యుడు తడ్డి తిరుపతి రావు, వైస్ ప్రెసిడెంట్ -2 పాలకొండ బార్ సభ్యుడు, జనరల్ సెక్రటరీ పార్వతీపురం బార్ సభ్యుడు గొర్లి వెంకట రావు, సెక్రటరీ – 1 కురుపాం బార్ సభ్యుడు బి.చంద్ర మౌళి, సెక్రటరీ -2 సాలూరు బార్ సభ్యుడు జి.అప్పలనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్వతీపురం బార్ సభ్యుడు బొంగు సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ -1 పార్వతీపురం బార్ సభ్యుడు కోలా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ -2 పాలకొండ బార్ సభ్యుడు, ట్రెజరర్ పార్వతి పురం బార్ సభ్యుడు ఫణి గ్రాహి, మెంబర్-1 పార్వతీపురం బార్ సభ్యుడు ఎ.లోవరాజు, మెంబర్ – 2 పార్వతీపురం బార్ సభ్యుడు పి.చంద్ర శేఖర రావు, మెంబర్ – 3 పార్వతీపురం బార్ సభ్యుడు ఎస్.కృష్ణలను నియమించగా, విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ విజయనగరం బార్ సభ్యుడు కండి వెంకటేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ – 1 కొత్తవలస బార్ సభ్యుడు యెగిరెడ్డి గణపతి రావు, వైస్ ప్రెసిడెంట్ -2 విజయనగరం బార్ సభ్యుడు బి.పరమేశ్వర రావు, జనరల్ సెక్రటరీ విజయనగరం బార్ సభ్యుడు మీసాల మురళి, సెక్రటరీ -1 విజయనగరం బార్ సభ్యురాలు కె.గోదాదేవి, సెక్రటరీ -2 బొబ్బిలి బార్ సభ్యుడు పెంటా జగన్నాధము, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయనగరం బార్ సభ్యుడు బాదుకొండ రాంబాబు, జాయింట్ సెక్రటరీ -1 శృంగవరపుకోట బార్ సభ్యుడు జి.కోమల్ ప్రవీణ్, జాయింట్ సెక్రటరీ -2 బొబ్బిలి బార్ సభ్యుడు గండి శ్రీనివాస రావు, ట్రెజరర్ విజయనగరం బార్ సభ్యుడు మీసాల త్రినాథ రావు, మెంబర్-1 గజపతినగరము బార్ సభ్యుడు ఎస్.ఆర్.ఎ.వాసుదేవ రావు, మెంబర్ -2 బొబ్బిలి బార్ సభ్యురాలు గండి మీన, మెంబర్ -3 విజయనగరం బార్ సభ్యుడు బి.సునీల్ కుమార్ లను నియమించడం జరిగిందని గౌరీమణి తెలిపారు. అదే విధంగా విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్ -2 విశాఖపట్నం బార్ సభ్యుడు మన్నం ప్రవీణ్, సెక్రటరీ -1 విశాఖపట్నం బార్ సభ్యురాలు పిల్లా సుమతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ – విశాఖపట్నం బార్ సభ్యుడు కదిరి రాము, జాయింట్ సెక్రటరీ -1 విశాఖపట్నం బార్ సభ్యుడు పొదుగు చంద్ర శేఖర్, ట్రెజరర్ విశాఖపట్నం బార్ సభ్యుడు సముజీ మణి కుమార్, మెంబర్-1 భాగది బుజ్జి గణపతి, మెంబర్ -2 విశాఖపట్నం బార్ సభ్యురాలు కిలారి వసంత లక్ష్మిలను నియమించగా, అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ అనకాపల్లి బార్ సభ్యుడు గేదెల రామచంద్ర రావు, జనరల్ సెక్రటరీ నర్సీపట్నం బార్ సభ్యుడు ఊడి గోవింద రావు, ఎన్టీఆర్ జిల్లా ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ విభాగం ప్రెసిడెంట్ గా బెజవాడ బార్ సభ్యురాలు కె.వి.ఎన్.రంగనాయకమ్మలను నియామకము చేసి వారందరికీ నియామక పత్రములు అందజేయడం జరిగిందని ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ బొలిశెట్టి గౌరీమణి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ అదట్రావు వెంకటరావు, వైస్ ప్రెసిడెంట్ 2 చిన్నం వీర్రేడ్డి, సెక్రటరీ -1 కొత్తకోట నవీన్, జాయింట్ సెక్రటరీ మొదలి వి.ఎస్. ప్రకాశరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్లా నీలకంఠ చక్రవర్తి, మెంబర్లు గోగులమంద భాస్కర రావు, పార్వతిపురము బార్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాస రావు మరియు ఇతర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?*

TNR NEWS

ఆవిర్భావ సభ భద్రత ఏర్పాట్లుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ

అక్రిడేషస్లు ఎర!

Dr Suneelkumar Yandra

ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

TNR NEWS

సుదూరప్రాంతాల నుండి ఆవిర్భవసభకు వచ్చేవారికి జ్యోతుల భోజనాల ఏర్పాటు

Dr Suneelkumar Yandra