- పౌరసంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : బహిరంగ మద్యపానం రోజు రోజుకీ ఎక్కువవ్వడం వలన మద్యం చలివేంద్రం తరహాలో ప్రతి వైన్స్ వద్ద కూల్ డ్రింక్స్ మాదిరిగా పబ్లిక్ గా సేవిస్తున్న దుస్థితి ఎక్కువయ్యిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. మద్యం అమ్మకాల ఆదాయంలో పదిశాతం మద్య విమోచన ప్రచారం కోసం కేటాయించాలన్నారు. యువతరం పిల్లలు వీటి బారిన పడకుండా ఉండేందుకు బహిరంగ మద్యపానం నిర్వహణను కఠినం చేయాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో స్థానికులతో మద్య విమోచన కమిటీలు ఏర్పాటు చేసి బహిరంగ మద్యపాన నిషేదం అమలు చేయించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మద్యం, మత్తు పదార్థాలు, గుట్కా వంటి వాటిని ప్రభావితం చేసే ప్రచార ప్రకటనలు నియంత్రణ చేయాలన్నారు. మద్యం బ్రాండ్ కు చెందిన ప్రముఖ కంపెనీల మినరల్ వాటర్ ప్రకటనలు టీవీల్లో రావడం, పత్రికల్లో నిషేధిత గుట్కాపాన్ ను పోలిన ప్రకటనలు వెలువడకుండా కఠినం చేయాల్సిన అవసరం గుర్తించాలన్నారు. మద్యపానం ఎక్కువ కావడం వలన ప్రతి కూడలి లోనూ అనర్థాలు ఎదురవు తున్న దుస్థితి వుందన్నారు. గంజాయి నియంత్రణ ఈగల్ నిర్వహణలో బహిరంగంగా మద్యం సేవించే వారిని కట్టడి చేసే బాధ్యత తీసుకో వాలన్నారు. వేసవి ఎండల వేడిమితాపం తగ్గాలంటే చల్ల చల్లని బీర్లు సేవించడం ఆరోగ్య ప్రదాయకం అన్నట్టుగా మద్యం ప్రియులు అమ్మకం దారులు చేస్తున్న ఆకతాయి దృక్పథం వలన యువతరం లోనయ్యి మద్యపానం బారిన పడుతున్నార న్నారు. మద్యం సేవించి నడుపుతున్న వాహనాల వలన ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిమానాలు సగటున 35శాతం మించిందన్నారు. మద్యపానం వలన 35ఏళ్ళకే మరణాలకు గురయ్యి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అభాగ్యు లవుతున్నారన్నారు. మద్య విమోచనం కోసం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశ వర్కర్స్, ఆంగన్ వాడీ సిబ్బంది, సచివాలయం స్టాఫ్ మున్నగు వారితో ప్రభుత్వ ప్రయివేటు సంస్థల్లో నెలకు ఒకసారి ప్రచార జాతా నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరం పాడవ్వకుండా వుండేందుకు ప్రభుత్వం యోచన చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు. మద్యపానం మోజు తగ్గించాలని డిమాండ్ చేశారు.