Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలి

పిఠాపురం : జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం మక్కువ మండల “ప్రజాశక్తి” విలేకరి రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షుడు వేణుగోపాల్‌ నాయుడు దాడి చేయడం,బెదిరించడం దారుణమన్నారు. మక్కువ మండలం ఏ- వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్‌ నాయుడిని కలవడానికి వెళ్లిన విలేకరి రామారావుపై టిడిపి నేత బూతులు తిట్టడమే కాకుండా దాడి చేశారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఆన్నారు. ఇటీవల ప్రజాశక్తి  పత్రికలో ‘ఎన్నికల కోడ్‌ అధికారులకు పట్టదా..?’ అనే శీర్షికన మంత్రి సంధ్యారాణి ఫ్లెక్సీలతో ఉన్న ఫోటోతో వార్త వెలువడగా కక్ష్య పెట్టుకున్న వేణుగోపాల్‌ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారన్నారు. విలేకరి రామారావు పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు కుంచె చిన్న మద్దతు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మా భూమి మాకు ఇప్పించండి మహాప్రభో – పొన్నాడ పంచాయతీ పాతదడాలపాలెం దళితలు

Dr Suneelkumar Yandra

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

Dr Suneelkumar Yandra

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాము – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dr Suneelkumar Yandra

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

Dr Suneelkumar Yandra

రంజాన్ ఉపవాసం భారతీయ సోదరుల సంప్రదాయం – పౌర సంక్షేమ సంఘం

చారిత్రక కాకినాడ పురపాలక భవనాన్ని పరిరక్షించాలి – పౌర సంక్షేమ సంఘం వినతి