వన్య ప్రాణుల సమరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత మీ ప్రాంతంలో గాని మీ పొలాలలో గాని ఏమైనా వణ్యప్రాణులు వచ్చినట్లయితే వాటిని సంరక్షించి ఫారెస్ట్ వారికి తెలియజేయాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ వెంకన్న అన్నారు. ఆదివారం కోదాడ పట్టణానికి చెందిన చింతా భాస్కర్ గోర్లు మఠంపల్లి మండలం పెదవీడు ప్రాంతంలో గొర్లు మేపుతుండగా గొర్ల మందలో అనుకోకుండా జింక గొర్ల మందలో చేరి ఒక బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను వదిలేసి జింక వెళ్లిపోయింది. వీరు గొర్లను మేపుకోవటానికి అల్లిస్తుండగా గొర్లమందలో ఈ జింకపిల్ల కనిపించింది. ఉన్న పాటను అలాగే వదిలేస్తే ఏమైనా చంపేస్తాయి అని ఆ జింక పిల్లను తీసుకొని వచ్చి సంబంధిత ఫారెస్ట్ వారికి ఫోన్ చేయగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆదిత్య ఆదేశాల మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న వచ్చి ఆ పిల్లను తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జింక పిల్లను ముందుగా ఫీడింగ్ ఇచ్చి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేశాల మేరకు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం లైన వరంగల్, హైదరాబాద్ కేంద్రాలలో ఏదో ఒకదానికి తరలిస్తామని తెలిపారు.

previous post
next post