మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు నందు మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మడేలేశ్వర స్వామి దేవాలయం నందు మూడవరోజు సోమవారం శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర పోతురాజుల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ సందర్భంగా దేవాలయ గర్భగుడిలో గ్రామ పురోహితులు వారణాసి బుచ్చి రామయ్య శాస్త్రి, వారణాసి కిషోర్ శాస్త్రిల ఆధ్వర్యంలో పలువురు పురోహితులు శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర పోతురాజుల విగ్రహాలను సుముహూర్త కాలంలో, వేదమంత్రాలతో సన్నాయి మేళతాళాల నడుమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు, అనంతరం గ్రామంలోని రజకులు దేవాలయం నందు శ్రీ సీతాలమ్మ,మడేలేశ్వర, పోతురాజు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండల కేంద్రంలో గత మూడు రోజులుగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహిస్తున్న మడేలేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల సంపత్, మనవరాలు చిట్యాల శ్వేత దర్శించుకుని మడేలేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రజకులు ఐక్యతతో నూతనంగా మడేలేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ నేడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి తాము హాజరు కావడం ఆనందదాయకమన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ సీతాలమ్మ,
మడేలేశ్వర స్వామి విగ్రహాల దాత రజక రత్న కందకట్ల శ్రీనివాసరావు, దేవాలయ కమిటీ అధ్యక్షులు తంగెళ్ల నాగేశ్వరరావు, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.