Tnrnews.in
తెలంగాణ

దళిత యువకుడు రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి… *జైలు నుండి పోలీసుల ద్వారా హాస్పిటల్ కి వెళ్ళిన రాజేష్ మృతి చెందితే ప్రభుత్వ అధికారులు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరి కాదు… దళితుల పట్ల పోలీస్ అధికారుల చిన్న చూపు తగదు… రాజేష్ కుటుంబానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్…

కోదాడ,చిలుకూరు పోలీసుల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందిన కోదాడ గాంధీనగర్ కు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి పై సమగ్ర విచారణ జరపాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోదాడ గాంధీ నగర్ లోని కర్ల రాజేష్ తల్లి,తమ్ముడిని పరామర్శించి మృతికి సంబంధించిన వివరాలు తెలుసుకొని,రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలు జరిగాయనే పేరుతో రాజేష్ పై కేసు నమోదు చేయకుండా నాలుగు రోజులు విచారణ పేరుతో కోదాడ పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.రిమాండ్ చేయకముందే అనారోగ్యంతో బాధపడుతున్న రాజేష్ కు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడంతో మృతి చెందారని,రాజేష్ మృతికి పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. రాజేష్ పై ఎఫ్ఐఆర్ చేయకుండా, రాత్రిపూట ఇంటికి పంపకుండా స్టేషన్ లోనే ఉంచి నాలుగు రోజులు ఎలా విచారణ చేశారని ప్రశ్నించారు. విచారణ సమయంలో రాజేష్ ని కలవడానికి తల్లి వెళ్లిన సందర్భంలో కనీసం మాట్లాడకుండా చేశారని తెలిపారు. రాజేష్ పై మోపబడ్డ కేసుకు సంబంధించిన డబ్బులు పోలీసులు రికవరీ చేసి కూడా అతని తీవ్ర ఇబ్బందులు గురిచేసారని దాని మూలంగానే రాజేష్ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీస్ కేసు మోపబడి పోలీసుల విచారణను ఎదుర్కొన్న రాజేష్ జైల్లో నుండి హాస్పిటల్ కి వెళ్లి మృతి చెందితే కనీసం ప్రభుత్వ అధికారులు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు.జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వం నుండి రావలసిన సహకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రాజేష్ మరణానికి కోదాడ చిలుకూరు పోలీసులే కారణమంటూ దళిత సంఘాలు ఆందోళన చేసిన ఫలితంగా ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ మృతిలో అడుగడుగున పోలీసుల యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని హాస్పిటల్లో చెకప్ చేయించకుండా రిమాండ్ చేయడం జైలుకు తీసుకెళ్లాక ఆరోగ్యం బాగాలేదని పేరుతో హుజూర్నగర్,సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్లో మరియు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందించడం వంటి పరిణామాలు చూస్తే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. దళితుల పట్ల ప్రభుత్వ అధికారులకు,పోలీసులకు చిన్న చూపు తగదని అన్నారు. ఇప్పటికైనా రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టేకుల సుధాకర్,డి.దుర్గారావు సిఐటియు పట్టణ కన్వీనర్ మిట్టగడుపుల ముత్యాలు, దాసరి శ్రీనివాస్ కెవిపిఎస్ జిల్లా నాయకులు జంగపల్లి శ్రీను రాజేష్ కుటుంబ సభ్యులు కర్ల రాజా,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

Harish Hs

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

మెట్ పల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ 

TNR NEWS

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఆకట్టుకున్న ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ విద్యార్థుల ప్రదర్శన

TNR NEWS

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS