ప్రతి సంవత్సరం చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో ఉత్సవంగా జరుపుకునే వినాయక చవితి 27-08-2025 బుధవారం నాడు ప్రారంభం కానున్నదని దేవి ఉపాసకులు త్రిశక్తి శాంభవి పీఠాధిపతులు విష్ణు బోట్ల హరి ప్రసాద్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా విష్ణుబోట్ల మాట్లాడుతూ స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సర భద్రపద శుద్ధ చవితి 27.08.2025న ఉదయం 4:30 నిమిషముల నుండి శ్రీ సిద్ధి వినాయక పూజ చేయుటకు శుభప్రదంగా ఉన్నది తొమ్మిది రోజులు 04-09-2025 గురువారం వరకు నవరాత్రుల పూజల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు జరుపుకోవాలని అన్నారు.ఇందులో ఎలాంటి మార్పు ఉండదు ఆ తరువాత 07-09-2025 ఆదివారం నాడు రాత్రి 9:30 దగ్గర నుంచి చంద్రగ్రహణం ఉన్నది కావున ఈ సంవత్సరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు 11 రోజులు చేస్తాం 13 రోజులు చేస్తాం అంటే వీలు కాదు అని అన్నారు. ఎందువలన అంటే గ్రహణం ఉన్నప్పుడు మనం ఏర్పాట్లు చేసిన గణపతి పీఠాలు గ్రహణకు ముందే ఉద్వాసన నిమర్జనా కార్యక్రమాలు రావాలి ఇది గమనించి అందరూ కూడా మీరు చేస్తున్న గణపతి మండపాలు యొక్క కమిటీ వాళ్లకి భక్తులకి తెలియజేయడి.