కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం మోతే మండలం సిరికొండలో జరిగిన ముత్యాలమ్మ పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనం ఎత్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లి దయతో కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.