మున్నూరు కాపులు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యతను చాటి చెప్పాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తంరావు అన్నారు. ఆదివారం కోదాడ నియోజకవర్గంలో మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వహించిన కులగనలలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువగా చూపించి మున్నూరు కాపులకు తీరని ద్రోహం చేశారని అన్నారు. మా సంఖ్యను మేమే చూపించుకోవడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రెండు నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసి మున్నూరు కాపుల సంఖ్యను ప్రభుత్వానికి చెప్తామని అన్నారు. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కచ్చితంగా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, ఇన్చార్జి పాలేటి రామారావు, పొట్ట జగన్మోహన్ రావు, జాబిశెట్టి చంద్రమౌళి, కస్తూరి రాములు, సుంకర అభిధర్ నాయుడు, సందీప్, మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.