సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఉన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీలోని, MLC పాయింట్ వద్ద, సివిల్ సప్లై హమాలి కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, గత ఏడు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన హమాలి రేట్లను తక్షిణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సివిల్ సప్లై కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం పని చేసే హమాలీలని కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి, లారిలోకి లోడింగ్ చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సివిల్ సప్లై హమాలీలను కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో హామిలీలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలి కూలీలపై చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే హమాలీ రేట్లను ఇచ్చారో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా, కొనసాగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.