కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో “విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అధ్యాపకులతో ఆత్మీయ సమ్మేళనం” కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి మాట్లాడుతూ…. తల్లిదండ్రులు విద్యార్థులను క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని, ప్రతిరోజు కళాశాలకు వచ్చినట్లయితే 100% ఉత్తీర్ణత సాధిస్తామని అన్నారు. విద్యార్థుల చదువు, వారి ప్రవర్తనను తల్లిదండ్రులు లెక్చరర్స్ ని అడిగి తెలుసుకోవచ్చు అని అన్నారు. ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి అని అలా అయితేనే హాల్ టికెట్స్ వస్తాయని, ఎట్టి పరిస్థితులలోనూ విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ని ఇవ్వవద్దని అన్నారు. విద్యార్థుల క్రమశిక్షణలో అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు. కళాశాలలో సిలబస్ తో పాటుగా విద్యార్థికి జనరల్ నాలెడ్జికి సంబంధించిన బిట్స్ చెబుతూ, ప్రతివారం క్విజ్ కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. కళాశాలలో అదనంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలలో విద్యార్థులకు అవగాహన కలగజేస్తున్నట్లు కూడా ఆయన అన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థి తండ్రి బహిరుద్దీన్ మాట్లాడుతూ 1969 నుంచి ఇప్పటివరకు కళాశాలలో విద్యాబోధన మంచి ఫలితాలు సాధిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. బీ.సీ హాస్టల్ వార్డెన్ మమత మాట్లాడుతూ… హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నానని, ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టి కళాశాలకు పంపిస్తున్నామని ఆమె అన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన తల్లిదండ్రులు కళాశాల పనితీరు, బోధన, క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య, ఆర్.పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు,
జి.యాదగిరి,వి. బల భీమారావు, జి.నాగరాజు, యం.ప్రభాకర్ రెడ్డి, పి.రాజేష్, ఎం.రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి. వెంకన్న, పి .తిరుమల,యస్.గోపికృష్ణ, ఎం .చంద్రశేఖర్, ఇ.నరసింహారెడ్డి,యస్. కె.ముస్తఫా, ఇ . సైదులు, యస్.కె.ఆరీఫ్,యన్.రాంబాబు, కె.శాంతయ్య, యస్.వెంకటాచారి, డి .ఎస్ .రావు మొదలగు వారు పాల్గొన్నారు.