సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదివారం 5వ రోజు కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బాయ్స్, గర్ల్స్ క్యాంపస్ లలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు ఆదివారం యాజమాన్యం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోలాటాల, నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంగా ప్రదర్శించిన స్కిట్ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. పట్టణంలోని రంగా థియేటర్, పోలీస్ స్టేషన్, ఖమ్మం క్రాస్ రోడ్ లలో నిర్వహించిన ఈ ప్రదర్శనను చేసేందుకు ప్రజలు , ప్రయాణీకులు ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమాలలో కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల్ రావు, వైస్ ప్రిన్సిపాల్ జీ వీ, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు.