గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు కావున రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని బోల్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నారు. సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వినతి పత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని మాట్లాడుతూ రోజుల తరబడి రైతులు పిఏసియస్ కేంధ్రాల వద్ద గంటల తరబడి క్యూ లైనులో ఉంటున్నారు. అయినా ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియా కూడా అందటం లేదు అని అన్నారు. ఖరీఫ్ లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరము ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదనల్,పంపించినా సరిపడిన యూరియాని సరఫరా చేయటంలో కేంద్రప్రభుత్వము పక్షపాత ధోరణి అవలంభించడం వలన రైతులు సకాలంలో పంటలకు యూరియా చల్లలేక పోతున్నారని అన్నారు. ఇలా జరిగితే రైతుల పంట దిగుబడి తగ్గి రైతులు ఆర్థికంగాగత నష్టపోతారని అన్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారము క్రింద ఎకరానికి వరికి రూ.20,000/-లు చొప్పున ఇవ్వాలి. వేసంగిలో ప్రభుత్వము కొనుగోలు చేసిన సన్నరకము వరి ధాన్యానికి ప్రభుత్వము ప్రకటించిన పంటకు క్వింటాకు రూ.500/- చొప్పున బోనస్ను వెంటనే చెల్లించాలి.రెండు లక్షల పైన ఉన్న వ్యవసాయ పంట రుణాలను రద్దుచేసి తిరిగి పంట రుణాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వము చొరవ తీసుకొని తక్షణం యూరియా సరఫరా చేయాలని తెలంగాణా రాష్ట్ర రైతు సంఘము డిమాండ్ చేయుచున్నది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య,సిపిఐ తమ్మర గ్రామ శాఖ అధ్యక్షులు మాతంగి ప్రసాద్, కనగాల కొండయ్య, నాగేశ్వరరావు, బి.గోపాల్, ఎం రాజు, పుల్లయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.