సుధా బ్యాంక్ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. బుధవారం కోదాడ శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన రుణ మేళా కార్యక్రమాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖాతాదారుల సంక్షేమం కొరకు తక్కువ వడ్డీకి అనేక రుణ పథకాలు అందిస్తున్నామని ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, ఇంటి విస్తరణకు, విద్యా, వ్యాపార, గృహ బంగారం, వాహన రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, గిడ్డంగి సర్టిఫికెట్ల రుణాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఉపాధి మార్గాలను పొంది ఆర్థికంగా స్థిరపడాలన్నారు. సుధా బ్యాంక్ తక్కువ వడ్డీకే అందిస్తున్న రుణాలను కోదాడ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో సుధా బ్యాంకు కోదాడ బ్రాంచ్ మేనేజర్ చెన్నూరు. రవికుమార్,బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు………..
