గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు కోదాడ పట్టణంలోని మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎడవల్లి బాల్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ లు హాజరై వినాయకుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…భారత దేశ సంస్కృతిలో భాగంగా వినాయక చవితి సందర్భంగా వేలాదిమందికి గణేష్ మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. పురాతన సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యతని గుర్తు చేశారు.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ పండితులు, విష్ణుబొట్లహరిప్రసాద్ శర్మ యూత్ అధ్యక్షులు చలిగంటి ప్రసాద్ బాలేబోయిన శ్రీనివాస్ చలిగంటి మురళి కొలిపాక రాజేష్ బాడిష రమేష్ సత్తార్ తో పాటు యూత్ సభ్యులు పాల్గొన్నారు.