Tnrnews.in
తెలంగాణ

మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు కోదాడ పట్టణంలోని మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎడవల్లి బాల్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ లు హాజరై వినాయకుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…భారత దేశ సంస్కృతిలో భాగంగా వినాయక చవితి సందర్భంగా వేలాదిమందికి గణేష్ మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. పురాతన సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యతని గుర్తు చేశారు.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ పండితులు, విష్ణుబొట్లహరిప్రసాద్ శర్మ యూత్ అధ్యక్షులు చలిగంటి ప్రసాద్ బాలేబోయిన శ్రీనివాస్ చలిగంటి మురళి కొలిపాక రాజేష్ బాడిష రమేష్ సత్తార్ తో పాటు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విలువలతో కూడిన విద్యను అందించాలి

Harish Hs

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

Harish Hs

అనుమతులు లేని ఇసుక లారీ పట్టివేత

TNR NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి.  నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు.?  వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి.   కొత్త రోడ్లు వేయాలి.  _సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

మనస్థాపం తో యువతి ఆత్మహత్య 

TNR NEWS