సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 19 వ వార్డులో భగత్ సింగ్ నగర్ లో చిన్నారులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం వద్ద అన్నదానం కావాలని వేడుకున్న మూడు రోజుల్లోనే దాతలను పంపించి అన్నదానం ఆ వినాయకుడే చేయించాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ లో లయన్ కింగ్ యూత్ పేరుతో చిన్నారులు మాజీ కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ సహకారంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాగా అక్కడకు వెళ్లిన విలేకరులను అన్నదానం కావాలని చిన్నారులు కోరారు. ఇదే విషయమై విలేకరులు సోషల్ మీడియాలో పెట్టడంతో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చల్ల లక్ష్మీకాంత్ ముందుకు వచ్చి అల్పాహారానికి అంగీకరించారు. గురువారం రాత్రి అల్పాహారాన్ని భక్తులకు అందించేందుకు సిద్ధమవుతున్న సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డు గోపాలపురం శ్రీ గణేష్ కమ్యూనిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేస్తున్న సమయంలో కొంత అన్నప్రసాదాన్ని చిన్నారులకు ఇస్తామని తెలపారు. వారే వాహనంలో అన్న ప్రసాదాన్ని సూర్యాపేట జిల్లా పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు తీసుకువచ్చి దగ్గరుండి చిన్నారుల చేతుల మీదుగా భక్తులకు అన్నప్రసాధన వితరణ చేయించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు మాట్లాడుతూ ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడని వినాయకుడు మావెంటే ఉన్నాడని మావద్ద ఏమి లేకున్నా విగ్రహాన్ని పెట్టి పూజించామని అందుకే దాతలు ముందుకు వచ్చి మా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. అన్నదానానికి సహకరించిన చల్లా లక్ష్మీకాంత్, మాజీ కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్, జిల్లా పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబుతో పాటు గోపాలపురం శ్రీ గణేష్ కమ్యూనిటీ ఉత్సవ కమిటీ సభ్యులు, విలేకరులు మడూరి బ్రహ్మచారి, దేవరగట్ల సతీష్, కందుల నాగరాజు, మామిడి శ్రవణ్, పడిసిరి వెంకట్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త శ్రీరంగం రాము సైతం నేటి నిమజ్జనోత్సవానికి పులిహోర దద్దోజనం ఇస్తానని చిన్నారులకు హామీ ఇవ్వడంతో వినాయకుడే వారి వెంట ఉండి నడిపిస్తున్నాడని తేటతెల్లమైంది. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్, జిల్లా పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు, కింగ్ లయన్ యూత్ సభ్యులు పగిళ్ల హర్ష,, రాచూరి ప్రణీత్ కుమార్, రేశ్వంత్, రవి, రాకేష్, జయసింహ, బిట్టు, వెంకటేష్,, యశ్వంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.