ఆసిఫాబాద్: జిల్లాలో పులుల సంచారం నేపథ్యంలో స్పష్టమైన సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియ జేసేందుకు కృషి చేయాలని జిల్లా ఆటవిశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ గురువారం ప్రకటనలో తెలిపారు. తప్పుడు పుకార్లు, వార్తలు వ్యాప్తి చేయడం జరుగుతున్నట్లు గమనించడం జరుగుతుందన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. భయాందోళన సృష్టించడం సరి కాదన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారాన్ని ప్రచురించే ముందు అటల్ శాఖ అధికారులతో ధ్రువీకరణ చేసుకోవాలని కోరారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కాకుండా సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేస్తే వారిపై శాఖా పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.