పిఠాపురం : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ లో పని చేస్తున్న దాకే అప్పలరాజు మాస్టారుకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గత 28 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించడమే గాక కళానైపుణ్యంలోనూ తర్ఫీదు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న అప్పలరాజు మాస్టారు మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుందాం. అవార్డు పట్ల తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ హెచ్.ఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్ష ధ్వానాలు వెలిబుచ్చారు.