పిఠాపురం : పిఠాపురం బొజ్జా వారి తోటలో లిటిల్ స్టార్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు లిట్రిసి ఇండియా ట్రస్ట్ – చెన్నై వారి ఆధ్వర్యంలో వయోజన విద్యా సెంటర్స్ ను ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిధులు లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీచర్స్ కి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ టీ.కామేశ్వరరావు మాట్లాడుతూ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సామాజిక సేవా కార్యక్రమం చేపడుతున్నామని ఇందులో భాగంగా ఈ వయోజన విద్యా సెంటర్స్ ను రౌతులపూడి, ముమ్మిడివరం, జగపతిరాజపురం, నేమాం, పిఠాపురం పలు ప్రాంతాల్లో 15 విద్య సెంటర్స్ ను ప్రారంభిస్తున్నామని, ప్రతివారు కూడా చదువుకోవాలని చదువు జీవితాన్ని మార్చివేస్తుందని చాలామంది వారికున్న పరిస్థితులు బట్టి చదువుకో లేకపోయారని మరియు కొందరు భయంతో చదువుకోడానికి ఇష్టపడలేకపోతున్నారని అందుకని ఈ వయోజన విద్యా సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరు విద్యను సులభమైన పద్ధతిలో నేర్పించడం జరుగుతుందని మరియు స్వయం ఉపాధి ద్వారా స్త్రీలకు చేతివృత్తుల మీద ట్రైనింగ్ ప్రోగ్రాం, ఆరోగ్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. లిట్రిస్ ఇండియా ట్రస్ట్ – చెన్నై వారు ఈ వయోజన విద్యకు సంబంధించిన పుస్తకములు, పలకలు, బ్లాక్ బోర్డ్, చార్జింగ్ లైట్స్ మెటీరియల్ను స్పాన్సర్ చేశారని సెంటర్స్ లో పెద్దవారికి బోధించడం కొరకు టీచర్స్ కి ఏలూరులో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అనంతరం లిట్రస్ ఇండియా ట్రస్ట్ వారు అందించిన విద్యా మెటీరియల్స్ టీచర్స్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.రాధ, కేవీపీ ప్రసాద్ మాస్టర్, కె.అప్పారావు, మనఊరు – మన బాధ్యత ప్రెసిడెంట్ కొండేపూడి శంకర్రావు, మనఊరు – మన బాధ్యత సెక్రెటరీ అల్లవరపు నగేష్, బి.నానిబాబు, టి.బ్యూలా గ్రేస్, టి.కృపారాణి మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

previous post