కోదాడ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ నరేష్ పై శనివారం రాత్రి జరిగిన దాడిని కోదాడ డివిజన్ గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఖండించారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న నరేష్ ను పరామర్శించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.